Viral: బీజేపీ MLC ఇంటి ముందు బ్యాగ్ విసిరేసి వెళ్ళిన వ్యక్తి.. పోలీసులు వచ్చి ఓపెన్ చేసి చూడగా షాక్

ఆదివారం ముంబై మాతుంగాలోని బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ నివాసం వెలుపల ఓ మిస్టరీ బ్యాగ్ కలకలం రేపింది. అందులో ప్రమాదకర విస్పోటనాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తమవ్వడంతో హైటెన్షన్ నెలకుంది. ఫైనల్‌గా

Viral: బీజేపీ MLC ఇంటి ముందు బ్యాగ్ విసిరేసి వెళ్ళిన వ్యక్తి.. పోలీసులు వచ్చి ఓపెన్ చేసి చూడగా షాక్
Maharashtra News

Mumbai: ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఓ బ్యాగుతో సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు బ్యాగ్ అక్కడ వదిలేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్సీకి తెలిపారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు జాగ్రత్తగా ఆ  బ్యాగును ఓపెన్ చేయగా లోపల బంగారం, వెండి, నాణేలు, నగదు, గణపతి విగ్రహం కనిపించాయి. ముంబైలోని మాతుంగాలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్((Prasad Lad BJP) నివాసం వెలుపల ఆదివారం ఉదయం ఈ ఇన్సిడెంట్ జరిగింది. పంచనామా చేసిన తర్వాత బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.  ప్రసాద్ లాడ్ ఇంటి బయట ఆ వ్యక్తి ఈ బ్యాగును ఎందుకు వదిలేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వదిలేసి వెళ్లిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై మాతుంగ పోలీసులు(Mumbai Matunga Police) దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని.. పలువురిని విచారిస్తున్నారు.

ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ, ‘ఈరోజు (జూలై 10, ఆదివారం) ఉదయం 5.30 నుండి 6.00 గంటల మధ్య నా ఇంటి వెలుపల అనుమానాస్పద వ్యక్తి వెళుతున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది చూశారు. వారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా బ్యాగ్‌ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆషాఢ ఏకాదశి పండుగ రోజునే ఇలా జరగడంతో మా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయి.’ అని ఆయన పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం