Vitamin Deficiencies: ఈ రెండు విటమిన్స్ లోపించాయా? మీ కంటి చూపు ప్రమాదంలో పడినట్లే

శరీర పని తీరు సులభతరం చేసేందుకు విటమిన్స్, మినరల్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి రక్షణ కల్పించడంతో పాటు ఎముకల బలానికి, మెదడు, హార్మోన్ల పనితీరు నియంత్రించడం వరకు విటమిన్స్ పాత్ర ఉంటుంది. యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన నేషన్స్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్స్, మినరల్స్ తప్పనిసరిగా కావాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. కొంత మందికి అదనపు సప్లిమెంట్స్ కూడా అవసరమవుతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్స్ అందకపోతే అనేక అనారోగ్య సమస్యలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.  మన శరీరానికి మొత్తం 13 విటమిన్లు అవసరం ఉంది. వీటిని వివిధ రకాల ఆహారాల నుంచి పొందవచ్చు. విటమిన్ లోపాల వల్ల అనేక సమస్యలు వస్తాయి. దీని వల్ల అలసట, బలహీనత, మైకం, ఎముకల బలహీనత, తరచూ అయ్యే గాయాల వల్ల చర్మం రంగు మారడం వంటివి జరుగుతాయి. వీటితో పాటు డిప్రెషన్ కి గురి కావడం, ఇన్ఫెక్షన్స్ సోకడం ఎక్కువగా ఉంటాయి.  దృషి లోపం  విటమిన్ ఏ, బి 12  లోపిస్తే కంటి చూపు మందగిస్తుంది. దీన్ని వెంటనే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే పూర్తి స్థాయిలో కంటి చూపు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం కారణంగా కంటి లోని కార్నియా చాలా పొడిగా  మారిపోయి అందహత్వానికి దారి తీస్తుంది. ఏడాదిలో దాదాపు 250000 నుంచి 500000 మంది చిన్నారులు తమ కంటి చూపుని కోల్పోతున్నట్లు అంచనా వేయడం జరిగింది. వారిలో సగం మంది తమ కంటి చూపుని కోల్పోయిన 12 నెలల్లోనే మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతుంది. అదే విధంగా విటమిన్ బి 12 లోపం వల్ల కూడా దృష్టి లోపం సంభవించవచ్చు.  మెదడు, నరాల పని తిరుకు విటమిన్ బి 12 ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల మనం రంగులని సరిగా గుర్తుపట్టలేము. దీన్నే కలర్ బ్లైండ్ నెస్ అని కూడా అంటారు.  విటమిన్ ఏ తక్కువ అనేందుకు సంకేతాలు  రేచీకటి విటమిన్ ఏ లోపానికి తొలి సంకేతంగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడిస్తుంది.  ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, కళ్ళు పొడిబారడం, స్కిన్ ఇరిటేషన్, సంతానోత్పత్తి సమస్యలు కూడా ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి. ఎవగా నిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేసేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. గర్భాశయ, మూత్రాశయ కాన్సర్ వంటి ప్రమాదాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.  విటమిన్ బి 12 లోపానికి సంకేతాలు  * చర్మం లేత పసుపు రంగులోకి మారడం.  * నాలుక ఎరుపు రంగులోకి మారడం(గ్లోసిటిస్) * నోటి పూత  * కంటి చూపు మందగింపు  * చిరాకు, డిప్రెషన్  * జ్ఞాపకశక్తి తగ్గడం విటమిన్  ఏ, బి 12 పొందడం ఎలా  ఛీజ్, కోడిగుడ్లు, చేపలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు, పాలు, పెరుగు  వంటి ఆహారం తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పొందవచ్చు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, బచ్చలి కూర, క్యారెట్స్, చిలగడా దుంపలు, ఎర్ర మిరియాలు, మామిడి, బొప్పాయి, ఆఫ్రికాట్లు వంటి పండ్లలో బీటా కెరొటిన్ ఎక్కువగా ఉంటుంది.  Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు Also Read: శరీరంలో విటమిన్ ఎ అధికంగా చేరితే వచ్చే సమస్యలు ఇవే

Vitamin Deficiencies: ఈ రెండు విటమిన్స్ లోపించాయా? మీ కంటి చూపు ప్రమాదంలో పడినట్లే

శరీర పని తీరు సులభతరం చేసేందుకు విటమిన్స్, మినరల్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి రక్షణ కల్పించడంతో పాటు ఎముకల బలానికి, మెదడు, హార్మోన్ల పనితీరు నియంత్రించడం వరకు విటమిన్స్ పాత్ర ఉంటుంది. యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన నేషన్స్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్స్, మినరల్స్ తప్పనిసరిగా కావాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. కొంత మందికి అదనపు సప్లిమెంట్స్ కూడా అవసరమవుతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్స్ అందకపోతే అనేక అనారోగ్య సమస్యలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 

మన శరీరానికి మొత్తం 13 విటమిన్లు అవసరం ఉంది. వీటిని వివిధ రకాల ఆహారాల నుంచి పొందవచ్చు. విటమిన్ లోపాల వల్ల అనేక సమస్యలు వస్తాయి. దీని వల్ల అలసట, బలహీనత, మైకం, ఎముకల బలహీనత, తరచూ అయ్యే గాయాల వల్ల చర్మం రంగు మారడం వంటివి జరుగుతాయి. వీటితో పాటు డిప్రెషన్ కి గురి కావడం, ఇన్ఫెక్షన్స్ సోకడం ఎక్కువగా ఉంటాయి. 

దృషి లోపం 

విటమిన్ ఏ, బి 12  లోపిస్తే కంటి చూపు మందగిస్తుంది. దీన్ని వెంటనే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే పూర్తి స్థాయిలో కంటి చూపు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం కారణంగా కంటి లోని కార్నియా చాలా పొడిగా  మారిపోయి అందహత్వానికి దారి తీస్తుంది. ఏడాదిలో దాదాపు 250000 నుంచి 500000 మంది చిన్నారులు తమ కంటి చూపుని కోల్పోతున్నట్లు అంచనా వేయడం జరిగింది. వారిలో సగం మంది తమ కంటి చూపుని కోల్పోయిన 12 నెలల్లోనే మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతుంది. అదే విధంగా విటమిన్ బి 12 లోపం వల్ల కూడా దృష్టి లోపం సంభవించవచ్చు.  మెదడు, నరాల పని తిరుకు విటమిన్ బి 12 ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల మనం రంగులని సరిగా గుర్తుపట్టలేము. దీన్నే కలర్ బ్లైండ్ నెస్ అని కూడా అంటారు. 

విటమిన్ ఏ తక్కువ అనేందుకు సంకేతాలు 

రేచీకటి విటమిన్ ఏ లోపానికి తొలి సంకేతంగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడిస్తుంది.  ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, కళ్ళు పొడిబారడం, స్కిన్ ఇరిటేషన్, సంతానోత్పత్తి సమస్యలు కూడా ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి. ఎవగా నిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేసేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. గర్భాశయ, మూత్రాశయ కాన్సర్ వంటి ప్రమాదాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. 

విటమిన్ బి 12 లోపానికి సంకేతాలు 

* చర్మం లేత పసుపు రంగులోకి మారడం. 

* నాలుక ఎరుపు రంగులోకి మారడం(గ్లోసిటిస్)

* నోటి పూత 

* కంటి చూపు మందగింపు 

* చిరాకు, డిప్రెషన్ 

* జ్ఞాపకశక్తి తగ్గడం

విటమిన్  ఏ, బి 12 పొందడం ఎలా 

ఛీజ్, కోడిగుడ్లు, చేపలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు, పాలు, పెరుగు  వంటి ఆహారం తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పొందవచ్చు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, బచ్చలి కూర, క్యారెట్స్, చిలగడా దుంపలు, ఎర్ర మిరియాలు, మామిడి, బొప్పాయి, ఆఫ్రికాట్లు వంటి పండ్లలో బీటా కెరొటిన్ ఎక్కువగా ఉంటుంది. 

Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు

Also Read: శరీరంలో విటమిన్ ఎ అధికంగా చేరితే వచ్చే సమస్యలు ఇవే