Weather Updates: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్!..తెలంగాణలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

దక్షిణ ఒడిశా, ఉత్తర ఎపి తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ

Weather Updates: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్!..తెలంగాణలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
Ap Weather Alert

Weather Updates: రుతుపవనాలకుతోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా, ఉత్తర ఎపి తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వివరించింది. మిగతా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా నేడు తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్క భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాల్లో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కానీ, 9న మాత్రం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

అటు, ఏపీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దక్షిణ కోస్తాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.