WhatsApp Two Phones : వాట్సాప్‌లో మరో మల్టీ-డివైస్ ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకే అకౌంట్ వాడొచ్చు!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ (WhatsApp companion mode) రాబోతోంది. The post WhatsApp Two Phones : వాట్సాప్‌లో మరో మల్టీ-డివైస్ ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకే అకౌంట్ వాడొచ్చు! appeared first on 10TV.

WhatsApp Two Phones : వాట్సాప్‌లో మరో మల్టీ-డివైస్ ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకే అకౌంట్ వాడొచ్చు!

Whatsapp Is Planning To Change The Way Multi Device Feature Works

WhatsApp Two Phones : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ (WhatsApp companion mode) రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకేసారి మూడు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే వాటిలో ఏదీ స్మార్ట్‌ఫోన్ కాదు. కేవలం ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ వంటి ఇతర డివైజ్‌ల్లో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలుంది. అయితే, త్వరలో ఈ మల్టీ డివైజ్ మోడ్ మారనుంది. అంటే.. త్వరలో రెండు ఫోన్‌లలో ఒకే సింగిల్ WhatsAppని ఉపయోగించవచ్చు.

WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp ఒక కొత్త సపోర్టు మోడ్‌పై పని చేస్తోంది. మల్టీ-డివైస్ 2.0 ఫీచర్ అని అనొచ్చు.Android వెర్షన్ 2.22.15.1‌ను WhatsApp బీటాలో గుర్తించారు. సపోర్టు మోడ్‌తో, మీరు మీ WhatsApp అకౌంట్లలో రెండవ మొబైల్‌ని లింక్ చేయవచ్చు. మీరు లింక్ చేసిన ఫోన్‌తో మెసేజ్‌లను పంపడానికి మీ ప్రైమరీ ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

Whatsapp Is Planning To Change The Way Multi Device Feature Works (1)

Whatsapp Is Planning To Change The Way Multi Device Feature Works 

WhatsApp companion mode మల్టీ-డివైస్ ఫీచర్‌.. వెబ్/డెస్క్‌టాప్ నుంచి WhatsApp చాట్ సురక్షితంగా సెకండరీ ఫోన్‌కి కాపీ చేసుకోవచ్చు. మీరు వెబ్ లేదా డెస్క్‌టాప్ కంపానియన్‌ని ఉపయోగించినప్పుడు.. కొంత సమయం పట్టవచ్చు. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.15.13తో WhatsApp బీటాలో ఈ ఫీచర్ గుర్తించారు. వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తుందనేది కచ్చితంగా తెలియదు. ప్రస్తుతానికి, వాట్సాప్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసేవరకు వేచి చూడాల్సిందే.

Read Also : WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?

The post WhatsApp Two Phones : వాట్సాప్‌లో మరో మల్టీ-డివైస్ ఫీచర్.. రెండు ఫోన్లలో ఒకే అకౌంట్ వాడొచ్చు! appeared first on 10TV.