Women Cops: పోలీసుల్లో పది శాతమే మహిళలు.. తాజా నివేదిక వెల్లడి

పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం కేటాయించే నిధుల శాతం కూడా తగ్గిపోతోంది. ఇప్పటికీ పోలీసు నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 10.5 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. అందులోనూ 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదు శాతం కంటే తక్కువ సిబ్బంది మాత్రమే ఉన్నారు. The post Women Cops: పోలీసుల్లో పది శాతమే మహిళలు.. తాజా నివేదిక వెల్లడి appeared first on 10TV.

Women Cops: పోలీసుల్లో పది శాతమే మహిళలు.. తాజా నివేదిక వెల్లడి

Women Cops

Women Cops: దేశంలోని మొత్తం పోలీసుల్లో 10.5 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. పోలీసు శాఖలో 33 శాతం మహిళలు ఉండాలన్న లక్ష్యం చేరుకునేందుకు మరో 33 ఏళ్లు పడుతుందని ఆ నివేదిక తేల్చింది. పోలీసు శాఖ గురించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. జనవరి 2021 వరకు వివిధ అంశాల్ని పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో మహిళలు 10.5 శాతం మాత్రమే ఉన్నారు. మూడింట్లో ఒక్క పోలీస్ స్టేషన్‌లోనే సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి.

Somesh Kumar: రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

41 శాతం పోలీసు స్టేషన్లలో మహిళా డెస్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్దిష్ట సంఖ్యకు అనుగుణంగా పోలీసు నియామకాలు చేపట్టడం లేదు. మహిళలు సహా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నియామకాలు కూడా నిర్దిష్టంగా జరగడం లేదు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం కేటాయించే నిధుల శాతం కూడా తగ్గిపోతోంది. ఇప్పటికీ పోలీసు నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 10.5 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. అందులోనూ 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదు శాతం కంటే తక్కువ సిబ్బంది మాత్రమే ఉన్నారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది నియామకాలు ఇప్పటిలాగే కొనసాగితే, 33 శాతం కోటా చేరుకునేందుకు మరో 33 ఏళ్లు పడుతుంది. నిర్భయ పథకం కింద నిధులొస్తున్నప్పటికీ దేశంలో మొత్తం 17,233 పోలీసు స్టేషన్లలో మూడింట ఒక వంతు స్టేషన్లలో సీసీ కెమెరాలు కూడా లేవు. ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్‌లో కనీసం ఒక్క సీసీ కెమెరా అయినా ఉంది.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించినప్పటికీ 63 శాతం జిల్లాల్లోనే సైబర్ సెల్స్ ఉన్నాయి. పంజాబ్, మిజోరం, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఒక్క సైబర్ సెల్ కూడా లేదు. త్రిపురలో మాత్రమే అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు. 2010-20 వరకు ఎస్సీ రిక్రూట్‌మెంట్ 12.6 శాతం నుంచి 15.2 శాతానికి పెరిగింది. ఎస్టీ రిక్రూట్‌మెంట్ ఈ పదేళ్లలో 10.6 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగింది. అంటే ఒక్క శాతమే పెరుగుదల నమోదైంది. ఓబీసీకి సంబంధించి 20.8 శాతం నుంచి 28.8 శాతం పెరుగుదల నమోదైంది.

The post Women Cops: పోలీసుల్లో పది శాతమే మహిళలు.. తాజా నివేదిక వెల్లడి appeared first on 10TV.