YSRCP Plenary 2022 Highlights: అధికారం అంటే అహంకారం కాదు: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సీఎం జగన్

YSRCP Plenary 2022 Highlights: దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని.. వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ (YSRCP Plenary 2022) సమావేశాలు నేటినుంచి రెండు రోజులపాటు జరగనున్నాయి. గుంటూరు..

YSRCP Plenary 2022 Highlights: అధికారం అంటే అహంకారం కాదు: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సీఎం జగన్
Ysrcp Plenary

YSRCP Plenary 2022 Highlights: దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని.. వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ (YSRCP Plenary 2022) సమావేశాలు నేటినుంచి రెండు రోజులపాటు జరగనున్నాయి. మొదటి రోజు సమావేశాలు ముగిశాయి.  గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదుట శుక్రవారం, శనివారం జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాల్లో భాగంగా YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీంతోపాటు ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు రెండు లక్షలమందికి పైగా హాజరయ్యే ఈ సమావేశాల్లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొన్నారు. తొలిరోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది.

సమావేశాల్లో భాగంగా ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వైసీపీ పార్టీ సభ్యుల రిజిస్ట్రేషన్‌ జరిగింది.  పార్టీ అధ్యక్ష ఎన్నిక అనంతరం వైసీపీ చీఫ్, సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం పార్టీ నివేదిక, పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు.

ప్లీన‌రీలో జ‌గ‌న్ ఏం చెప్పబోతున్నారు.. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తనకు తాను ఎన్ని మార్కులేసుకుంటారు. ముందస్తు ఎన్నికలపై ఏదైనా హింట్ ఇస్తారా.. ప్రతిపక్షాలపై కొత్తగా ఏవైనా బాణాలు సంధిస్తారా. నవరత్నాల్లాంటి జనరంజక పథకాల్ని ఇంట్రడ్యూస్ చేస్తారా.? ఇలా ప్లీనరీలో సమాధానం కోసం ఎదురుచూసే బరువైన ప్రశ్నలు బోలెడన్ని. వీటన్నిటికీ జగన్ స్పీచ్ కాపీయే సమాధానం కాబోతోంది.