YSRCP plenary: వైసీపీ ప్లీనరీకి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలు.. మెనూ ఇదే..

రాష్ట్రంలోని అన్ని కార్నర్స్ నుంచి ప్లీనరీకి వచ్చే అతిథులకోసం ఆయా ప్రాంతాలకు సంబంధించిన వంటకాల్ని ప్రత్యేకంగా వండిస్తున్నారు. దీని కోసం ఐదు భారీ స్థాయి కిచెన్లు ఏర్పాటయ్యాయి.

YSRCP plenary: వైసీపీ ప్లీనరీకి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలు.. మెనూ ఇదే..
Ysrcp Plenary

YSR Congress Party: ఈసారి ప్లీనరీలో వంటా వార్పు ఘనంగా ఉండబోతోంది. వైసీపీ వారి విందు… అహహ్హ నాకే ముందు అనే రేంజ్‌లో కనిపించబోతోంది. రెండు లక్షల మంది అతిధుల కోసం మూడు ప్రాంతాలకు సంబంధించిన రుచికరమైన వంట‌ల‌ను సిద్దం చేస్తోంది వైసీపీ యంత్రాంగం. ఘుమఘుమలాడే ర‌క‌ర‌కాల బిర్యానీల నుంచి డిఫరెంట్ వెరైటీస్‌తో నోరూరించే శాకాహార వంట‌కాల దాకా అన్నీ సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని కార్నర్స్ నుంచి వచ్చే అతిథులకోసం ఆయా ప్రాంతాలకు సంబంధించిన వంటకాల్ని ప్రత్యేకంగా వండిస్తున్నారు. దీని కోసం ఐదు భారీ స్థాయి కిచెన్లు ఏర్పాటయ్యాయి. ఒకవేళ వ‌ర్షం ప‌డినా భోజ‌నాలకు ఇబ్బంది కాకుండా జర్మన్ టెంట్లు నిర్మించారు. మొదటిరోజు 70 వేల మందికి భోజ‌నాలు సిద్దం చేస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మెనూలో ఇడ్లీ, మైసూర్ బజ్జి, పొంగ‌లి ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్ కోసం వేడివేడిగా ఉల్లి ప‌కోడి రెడీ అవుతోంది.

శనివారం 2 లక్షల మందికి భోజన ఏర్పాట్లు

వెజ్‌, నాన్‌ వెజ్‌ సహా 23 రకాల వంటకాలు

ప్లీనరీ ముగింపు రోజైన శనివారం రెండు లక్షల మందికి భోజ‌న ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం లంచ్ కోసం 23 ర‌కాల వంట‌ల‌ు వండుతున్నారు. వాటిలో చెప్పుకోదగ్గ స్పెషల్స్… మ‌ట‌న్ ద‌మ్ బిర్యానీ, ప్రాన్స్ క‌ర్రీ, చికెన్ క‌ర్రీ, బొమ్మిడాయిల పులుసు, వెజ్ బిర్యానీ వంటివి ఉండనున్నాయి. భోజ‌న‌-మంచినీటి క‌మిటీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శుభ్రత- ప‌రిశుభ్రత కమిటీ నాయకులు పూనూరు గౌతం రెడ్డి… భోజన ఏర్పాట్ల మీద స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టారు. టోటల్‌గా వైసీపీ ప్లీనరీ కోసం వచ్చే అతిథులు షడ్రుచులతో కూడిన వంటకాల్ని రుచిచూసి… తృప్తిగా రిటర్న్ జర్నీ అవుతారన్నమాట.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..