Hyderabad: హైదరాబాద్ ప్రజలకు నగర సీపీ అలెర్ట్.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు నగర సీపీ అలెర్ట్.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
Cp Cv Anand

Hyderabad Rains: వాతావరణ శాఖ  రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు నగర ప్రజలకు సూచనలు చేశారు హైదరాబాద్ సీసీ సీవీ ఆనంద్(CV.ANAND). ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.  చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆదివారం రాత్రి, సోమవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. రాత్రి వేళల్లో పోలీసులు విధుల్లో ఉంచుతామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీతో సంయుక్తంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ప్రా  తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతుంది. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. అన్ని జిల్లాల్లో వానలు ఉతికి ఆరేస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వాన పడుతోంది. నగరంలో కూడా తెరపి లేకుండా వాన దంచుతుంది. జీహెచ్ఎంసీ (GHMC) అధికారుల సహాయం కోసం 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

అధికారులకు కీలక సూచనలు…

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఆయాశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చించారు. జిల్లాల వారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించారు. ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలు తెలుసుకున్నారు. ఇంకా తీసుకోవాల్సి సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సోమ, మంగళ, బుధవారం మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి