Watch Video: టీమిండియా కొంపముంచిన ఒకే ఒక్క రనౌట్.. కోట్లాది హృదయాలను నిరాశపరిచిన ఆటగాళ్లు.. ఎప్పుడంటే?

MS Dhoni Runout WC 2019: టీమిండియా విజయానికి 25 పరుగులు కావాల్సిన సమయంలో ఎంఎస్ ధోని క్రీజులో ఉన్నాడు. వరల్డ్ కప్ 2019 ఫైనల్‌కు చేరుకోవడానికి సిద్ధమైన భారత్‌ను..

Watch Video: టీమిండియా కొంపముంచిన ఒకే ఒక్క రనౌట్.. కోట్లాది హృదయాలను నిరాశపరిచిన ఆటగాళ్లు.. ఎప్పుడంటే?
Ms Dhoni Runout Wc 2019

అది ప్రపంచ కప్ 2019 సెమీఫైనల్ మ్యాచ్. ఇండియా vs న్యూజిలాండ్ భీకరంగా తలపడుతున్నాయి. ఫైనల్ చేరేందుకు టీమిండియా 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. మహేంద్ర సింగ్ ధోని స్ట్రైక్‌లో ఉన్నాడు. అయితే, ఫ్యాన్స్ అంతా విజయం భారత్‌దే అన్న ధీమాలో ఉండిపోయారు. ఎందుకంటే, అక్కడ క్రీజులో ఉంది మిస్టర్ కూల్ కదా మరి. అయితే, 49 వ ఓవర్‌లో కథ అడ్డం తిరిగింది. ఆ ఓవర్ మూడో బంతి ఎంఎస్ ధోని బొటన వేలికి తగిలి లెగ్ సైడ్ నుంచి వెళ్లింది. బంతి మార్టిన్ గప్టిల్ వద్దకు వెళ్లగా, మహేంద్ర సింగ్ ధోని రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే, బాల్ నేరుగా స్టంప్‌ను తాకి, బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో ధోనీ, కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో, కోట్లాది భారత ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయి.

అయితే, ఎంఎస్ ధోని డైవ్ చేయకపోవడం కూడా ఓ కారణంగా నిలిచింది. బ్యాట్ క్రీజుకు కేవలం రెండు అంగుళాల దూరంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోని రనౌట్ కావడంతో కోట్లాది మంది ఆశలు అడియాశలయ్యాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. 2019 జులై 10న జరిగిన ఈ మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా మారింది. భారత దిగ్గజ కెప్టెన్, అత్యుత్తమ పరిమిత ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అయితే, ఈ మ్యాచ్‌తోనే వీడ్కోలు లేకుండా ఇలా సింపుల్‌గా వెళ్లిపోయాడు.