Andhra Pradesh: గల్లంతైన జాలర్లు క్షేమం.. బోటు తిరగబడిపోవడంతో అతి కష్టం మీద తీరంకు..

కోనసీమ జిల్లా వాడలరేవు కొత్తపాలెం సముద్ర తీరంలో జాలర్లని గుర్తించారు పోలీసులు. గత శనివారం వేటకు వెళ్లి సముద్రంలో కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా జాలర్లు క్షేమంగా ఉన్నారు.

Andhra Pradesh: గల్లంతైన జాలర్లు క్షేమం.. బోటు తిరగబడిపోవడంతో అతి కష్టం మీద తీరంకు..
Fishermens

ఆరు రోజులు ఉత్కంఠ వీడింది. గల్లంతైన జాలర్ల ఆచూకీ దొరికింది. అమలాపురం కొత్తపాలెంలో జాలర్లు క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లుగా అధికారులు తెలిపారు. 4 రోజుల క్రితం గల్లంతైన మత్స్యకారుల బోటు మాత్రం లభించలేదు. కోనసీమ జిల్లా వాడలరేవు కొత్తపాలెం సముద్ర తీరంలో జాలర్లని గుర్తించారు పోలీసులు. గత శనివారం వేటకు వెళ్లి సముద్రంలో కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా జాలర్లు క్షేమంగా ఉన్నారు. అమలాపురం జిల్లా కొత్తపాలెంలో వున్నట్లుగా సమాచారం. ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు మత్స్యకారులు.  బోటు తిరగబడిపోవడంతో తేడ్ల సహాయం తో అతి కష్టం మీద బయటపడ్డారని చెబుతున్నారు పోలీసులు. కొత్తపాలెం లైట్ హౌస్ సిగ్నల్స్ ఆధారంగా ప్రాణాలతో బయటపడినట్లుగా తెలిపారు మత్స్యకారులు.

అసలు ఏం జరిగిందంటే..

ఆరు రోజులు గడిచినా దొరకని నలుగురి మత్స్యకారుల ఆచూకీ.. మెరైన్, నేవీ, కోస్ట్ గార్డు బృందాల గాలింపు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. మచిలీపట్నంలో క్యామిలిపేట నుంచి నలుగు జాలర్లు జులై 2వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లారు. బోటు చెడిపోయిందని 3వ తేదీన వారిని ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత కమ్యూనికేషన్‌ కూడా కటైపోయింది.. సాయం కోసం సముద్రంలోకి వెళ్లిన మరో బోటుకు ఎక్కడగా ఆ బోటు కనిపించపోవడంతో తిరిగి వచ్చేసింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలు తల్లడిల్లిపోయారు. అయితే గల్లంతైన మత్స్యకారుల ఆచూకిని కనిపెట్టేందుకు గురువారం కూడా మరో రెండు పెద్ద బోట్లతో సముద్రంలోకి మత్స్యకారులు వెళ్తున్నారు. వీరికితోడుగా మెరైన్ బోట్లలో మూడు రోజుల ఆహారంతో సముద్రంలోకి మెరైన్ పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీర, ప్రియదర్శిని నౌకలు ఇప్పటికే గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇవాళ కూడా హెలికాప్టర్ తో గాలింపు చర్యలు కొనసాగింపు చేపట్టనున్నారు. సముద్రంలో మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు.