Bonalu 2022: ఘనంగా బోనాల ఉత్సవాలు.. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని

గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్.. మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆషాఢం బోనాల ఉత్సవాలపై.. కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

Bonalu 2022: ఘనంగా బోనాల ఉత్సవాలు.. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని
Talasani Srinivas Yadav

Bonalu festival 2022: కరోనావైరస్ మహమ్మారి కారణంగా హైదరాబాద్ నగరంలో రెండేళ్ల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఈనెల 17న సికింద్రాబాద్‌ మహంకాళి, 24న పాతబస్తీలో నిర్వహించే బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతం కంటే ఈ ఏడాది భక్తులు అధికారంగా వస్తారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్.. మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆషాఢం బోనాల ఉత్సవాలపై.. కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

18న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. బోనాల సందర్భంగా చార్మినార్‌ వద్ద 500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బందిని సైతం మోహరించనున్నట్లు తలసాని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి బోనాల ఉత్సవాలు జరగలేదని.. ఈసారి భారీ ఏర్పాట్లతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..