Health: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.. ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే అద్భుత ప్రయోజనాలు

మారుతున్న ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ తినడం, తిన్నాక సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొలెస్ట్రాల్ సమస్య. కొవ్వు...

Health: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.. ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే అద్భుత ప్రయోజనాలు

మారుతున్న ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ తినడం, తిన్నాక సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొలెస్ట్రాల్ సమస్య. కొవ్వు పదార్ధాలను అధికంగా తినడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ ముప్పు రాకుండా జాగ్రత్తపడేందుకు కొన్ని పద్ధతులను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇందుకోసం ప్రకృతిసిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే విషయంలో యాపిల్‌ను ఉత్తమ పండ్లలో ఒకటిగా పరిగణిస్తారు. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదనంగా, ఆపిల్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సమానంగా ఉంచడంలో సహాయపడతాయి. అరటిపండులోని ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది.

అరటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు ఆరోగ్యకరమైన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కాలేయంలోకి తీసుకువెళ్లి ప్రాసెసింగ్ చేయించడంలో ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. పైనాపిల్ లో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ ధమనులలోని కొలెస్ట్రాల్ నిక్షేపాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.