Andhra Pradesh: ఆ సీన్ తరువాత చంద్రబాబు మెదడు పోవడం ఖాయం.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్..
Andhra Pradesh: వైసీపీ ప్లీనరీ చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్లీనరీ సమావేశాలను విజయవంతం..


Andhra Pradesh: వైసీపీ ప్లీనరీ చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందన్నారు. దేశ చరిత్రలో అణగారిన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రపంచమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రసంసిస్తున్నారు పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు విమర్శలు ఆయన భావ దారిద్రానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్లీనరీకి 9 లక్షల మంది వచ్చినట్లు తెలుస్తోందని, ఇది చూసి చంద్రబాబు మెదడులో చిప్పు బయటకు వచ్చిందని ఎద్దేవా చేశారు. 2024లో వైసీపీ విజయం తరువాత పూర్తిగా మెదడు పోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
టీడీపీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడం ప్రధాన ఘట్టంగా పేర్కొన్న ఆయన.. వైసీపీ ప్లీనరీలో ఏం చేశాం.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నదే చెప్పామన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. నాలుగు పదుల జగన్‌ను ఏ విషయంలో అయినా ఎదుర్కోగలడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు శాడిస్టు, సైకోలా ప్రవర్తిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ అన్నారు ఎంపీ.
ఇదిలాఉంటే.. వైసీపీకి వైఎస్ విజయలక్ష్మి రాజీనామాపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. రెండు పార్టీల్లో ఉండకూడదనే కారణంతోనే విజయమ్మ రాజీనామా చేశారని వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా శ్వాశ్వత అధ్యక్షుడి ఎన్నిక జరిగిందన్నారు. నవ రత్నాలు – నవ సందేహాలు అన్నవారు.. నవరంధ్రాలు మూసుకున్నారంటూ విపక్ష పార్టీల నేతలకు చురకలంటించారు. కాగా, ప్లీనరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దినేష్‌కు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ తరఫున అందజేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు.