Andhra Pradesh: మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తాం.. వైసీపీ ప్లీనరీలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్నాళ్లుగా సద్దుమణిగిన మూడు రాజధానుల అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా పెదకాకాని వేదికగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఈ విషయంపై నాయకులు ప్రసంగించడం ఆసక్తి కలిగిస్తోంది. అన్ని...

Andhra Pradesh: మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తాం.. వైసీపీ ప్లీనరీలో తీర్మానం
Ycp Plenary Meetings

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్నాళ్లుగా సద్దుమణిగిన మూడు రాజధానుల అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా పెదకాకాని వేదికగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఈ విషయంపై నాయకులు ప్రసంగించడం ఆసక్తి కలిగిస్తోంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజధాని వికేంద్రీకరణ జరిగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, కాబట్టి మళ్లీ 3 రాజధానుల (Three Capitals) బిల్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీలో పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత అనే తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. తొలిరోజు నాలుగు రంగాలపై తీర్మానాలు ఆమోదించిన వైసీపీ ప్లీనరీ.. రెండో రోజు మరో ఐదు తీర్మానాలు ఆమోదించింది. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేసింది. పరిపాలన వికేంద్రీకరణ పారదర్శకత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని నేతలు వెల్లడించారు. కచ్చితంగా మరోసారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అయితే మూడు రాజధానుల అంశంపై ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానులపై నిర్ణయం తమ హక్కు అన్న ముఖ్యమంత్రి.. అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడడంతో పాటు వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై రాజ్యాంగం ప్రకారం న్యాయసలహా తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు రాజధానుల చట్టమే లేనప్పుడు దానిపై హైకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించారు.

మూడు రాజధానులపై భవిష్యత్తులో మరింత మెరుగైన చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. కాగా.. వైసీపీ ప్లీనరీ వేదికగా ఈ అంశంపై నాయకులు ప్రసగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.