Botsa Satyanarayana: చంద్రబాబు, టీడీపీ పని అయిపోయింది.. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స..

వైసీపీ నిర్వహించే ప్లీనరీలో టీడీపీ చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమంటూ బొత్స (Botsa Satyanarayana) పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను బొత్స మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం పరిశీలించారు.

Botsa Satyanarayana: చంద్రబాబు, టీడీపీ పని అయిపోయింది.. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స..
Botsa Satyanarayana

YSRCP Plenary: చంద్రబాబు, టీడీపీ పని అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ నిర్వహించే ప్లీనరీలో టీడీపీ చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమంటూ బొత్స (Botsa Satyanarayana) పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను బొత్స మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం పరిశీలించారు. మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 లక్షలకు పైగా వస్తారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్లీనరి సమావేశాలు జరగనున్నాయి. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్లినరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మూడేళ్ళలో ప్రభుత్వ ప్రగతిని ప్లీనరీ ద్వారా వివరిస్తామని తెలిపారు. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ ప్లీనరీలో చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమమని.. ఇంటికొకరు జైలుకు వెళ్లడం కాదు.. ఇంటికొకరు చంద్రబాబు కు ఓటు వేస్తారా..? అంటూ విమర్శించారు.

వైసీపీ నిర్వహించనున్న ఈ ప్లీనరీలో మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది..? రానున్న రెండేళ్లు ఏం చేయబోతుంది..? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలి..? అనే అంశాలపై వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ నాయకులతో చర్చించనున్నారు. మొత్తం 9 తీర్మానాలను ప్లీనరీలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు నాయకులు తెలిపారు. ఇప్పటికే ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను పార్టీ పెద్దలు సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, పరిపాలన పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..