England – India: రెండో టీ-20 లో ఇంగ్లండ్ చిత్తు.. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్- ఇండియా (England - India) రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 121 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 49 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమ్....

England – India: రెండో టీ-20 లో ఇంగ్లండ్ చిత్తు.. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
India Vs England Rohit Sharma

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్- ఇండియా (England – India) రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 121 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 49 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమ్ ఇండియా సిరీస్ ను గెలుచుకుంది. మొదట నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 121 పరుగులకే ఆలౌట్‌ అయింది. హర్షల్‌ పటేల్‌ వేసిన 17వ ఓవర్‌ చివరి బంతికి పార్కిన్‌సన్‌ (0) బౌల్డవడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరోవైపు డేవిడ్‌ విల్లే (33) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో పెద్ద మార్పు చేసింది. రిషబ్ పంత్‌తో పాటు రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చి, తొలి వికెట్‌కు 29 బంతుల్లో 49 పరుగులు జోడించారు. రోహిత్ 20 బంతుల్లో 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడిపోయాయి.

కాగా.. పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న విరాట్ మరోసారి ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో బంతికి రిషబ్ పంత్ కూడా 15 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేక 15 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ ఔట్ అయిన తర్వాతి బంతికి హార్దిక్ కూడా 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇద్దరినీ క్రిస్ జోర్డాన్ అవుట్ చేశాడు. పాండ్యా ఔటైన తర్వాత, దినేష్ కార్తీక్‌పై అంచనాలు నెలకొన్నాయి. కానీ, అతను కూడా పెద్దగా రాణించలేక 17 బంతుల్లో 12 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.