Sumanth: ఆ సమయంలో చాలా సార్లు కన్నీళ్లు వచ్చాయి.. హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్ గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది.

Sumanth: ఆ సమయంలో చాలా సార్లు కన్నీళ్లు వచ్చాయి.. హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sumanth 1

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సీతారామం (Sita Ramam). ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ కథానాయికగా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్ ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్ గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది. ఈ సందర్భంగా వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. ”కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో వుంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ… మద్రాస్ రెజిమెంట్” అని సుమంత్ చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తికరంగా వుంది.

సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ.. పదహారేళ్ళ క్రితం సీతారాముల ప్రేమ కథగా ‘గోదావరి’ సినిమా చేశాను. అది క్లాసిక్ గా నిలిచింది. పదహారేళ్ళ తర్వాత ఇంకో సీతారాముల కథలో భాగంగా వుండటం అదృష్టంగా భావిస్తున్నాను. సీతారామం ఒక క్లాసిక్ ఎపిక్ చిత్రంగా నిలుస్తుంది. నా కెరీర్ లో మొదటి సపోర్టింగ్ రోల్. ఈ స్క్రిప్ట్ ని చాలా క్షుణ్ణంగా చదివాను. చాలా చోట్ల కన్నీళ్లు వచ్చాయి. నా పాత్రే కాదు ఈ సినిమాలో అన్నీ పాత్రలు చాలా కీలకంగా వుంటాయి. హీరో పాత్రలు చేస్తూ ఇలాంటి కీలకమైన పాత్రలు చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా భిన్నమైన పాత్ర. సవాల్ తో కూడినది. ఇలాంటి పాత్ర కోసం చాలా రోజులుగా ఎదురుచుస్తున్నాను. ఈ పాత్ర చేసే మంచి అవకాశం ఇచ్చినందుకు స్వప్న దత్, అశ్వినీదత్, దర్శకుడు హను గారికి కృతజ్ఞతలు. హీరో దుల్కర్ సల్మాన్ నా ఫేవరేట్ కో స్టార్. మంచి వ్యక్తి. సీతారామం షూటింగ్ ఒక మధురమైన జ్ఞాపకం. సినిమా ఆగస్ట్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్లాసిక్ ఎపిక్ ని మీరంతా చూసి ఆనందించాలి” అని కోరారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.