Tirumala Srivaru : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. ఆ రోజున తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండుకోగా బయట క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 73, 016 మంది భక్తులు దర్శించుకోగా..

Tirumala Srivaru : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. ఆ రోజున తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala Brahmotsavalu

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. ఎందుకంటే.. తిరుమలలో ఆ ఒక్కరోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఈ విషయం భక్తులు గమనించగలరని మనవి చేసింది. జూలై17న ఆణివార అస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈనెల 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 12న విఐపి బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా 11న విఐపి బ్రేక్‌దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది.

మరోవైపు తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండుకోగా బయట క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 73, 016 మంది భక్తులు దర్శించుకోగా 37,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4,09 కోట్లు వచ్చిందని వివరించారు.

ఈ క్రమంలోనే తిరుమలలో టైమ్‌స్లాట్‌ దర్శన విధానాన్ని తిరిగి ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 11 న నిర్వహించే పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరులోగా కలకంబాడి రోడ్డు, డిసెంబరులోగా శ్రీనివాస సేతు రోడ్డు మార్గాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి