BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
ప్రముఖ దేశీయ ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి ఈ కొత్త BSNL ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయి. The post BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే.. appeared first on 10TV.
BSNL Prepaid Plans : ప్రముఖ దేశీయ ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి ఈ కొత్త BSNL ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయి. BSNL అందించే ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లల్లో రూ. 228, రూ. 239తో సహా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. BSNL అందించే ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు రెండూ ఒక నెల మొత్తం వ్యాలిడీతో వచ్చాయి. లేటెస్టుగా BSNL STV 228, రూ. 239 ప్లాన్ల గురించి తెలుసుకుందాం.. కొత్తగా ప్రవేశపెట్టిన BSNL STV 228 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 2GB రోజువారీ డేటాతో వస్తుంది. మీ డేటాను పూర్తిగా వాడిన తర్వాత, డేటా స్పీడ్ 80Kbpsకి తగ్గిపోతుంది. ఒకరికి రోజుకు 100 SMS పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ జూలై 1, 2022 నుంచి లైవ్ లోకి వస్తుంది. ఈ ప్యాక్‌ను కొనుగోలు చేసేవారికి ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను కూడా BSNL ఆఫర్ చేస్తోంది.
BSNL కంపెనీ అందించే మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 239 ఉంది. ఈ ప్లాన్‌లో రూ.10 టాక్‌టైమ్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక BSNL యూజర్లు రోజుకు 2GB డేటాతో పాటు 100 SMSలను కూడా పొందవచ్చ గతంలో ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే.. మీ మొత్తం డేటాను ఒకసారి ఉపయోగించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ 80Kbpsకి తగ్గిపోతుంది. గేమింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. TelecomTalk నివేదికలో టాక్‌టైమ్ వాల్యూ యూజర్ ప్రైమరీ అకౌంటుకు యాడ్ అవుతుందని వెల్లడించింది. BSNL నుంచి కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఒక నెల చెల్లుబాటు వ్యవధితో రానున్నాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే కాదు.. GPII, GPIIకి యాక్టివ్ స్టేటస్ తిరిగి రావాలంటే కనీసం రూ. 107 రీఛార్జ్ చేసుకోవాలని టెలికాం కంపెనీ ధృవీకరించింది. ఈ ఆఫర్ జూలై 1, 2022 నుంచి అందుబాటులో ఉండనుంది.
అంతేకాదు.. BSNL ఇటీవలే కొత్త రూ.87 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. BSNL అధికారిక వెబ్సైట్లో ఈ రెండు ప్లాన్లను లిస్టు చేసింది. రూ. 87 ధరతో ఈ ప్లాన్‌లో హైస్పీడ్ 1GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాలింగ్‌లో లోకల్, రోమింగ్ మరిన్ని అందుబాటులో ఉంటాయి. సాధారణ బెనిఫిట్స్ కాకుండా One97 కమ్యూనికేషన్స్ ద్వారా హార్డీ మొబైల్ గేమ్స్ సర్వీసును పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ యూజర్లు క్రీడలు, ఆర్కేడ్‌లతో సహా వివిధ గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చు. BSNL అందించే చౌకైన ప్లాన్లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
Read Also : BSNL Fiber : BSNL చీపెస్ట్ ఇంటర్నెట్ ప్లాన్ ఇదే.. 1TB డేటా మీ సొంతం.. ధర ఎంతంటే?
The post BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే.. appeared first on 10TV.