Gold and Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.. ఇంతకీ కొనచ్చా? కొనకూడదా?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్‌! పుత్తడి ధర నేడు (జులై 10) కూడా స్థిరంగానే కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో వినియోగదారులు..

Gold and Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.. ఇంతకీ కొనచ్చా? కొనకూడదా?
Gold Price Today

Latest Gold And Silver Prices on July 10th: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్‌! పుత్తడి ధర నేడు (జులై 10) కూడా స్థిరంగానే కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో వినియోగదారులు బంగారం కొనవచ్చా? లేదా?అనే మీమాంసలో ఉన్నారు. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటే తప్ప దేశీయ ధరలు ఇలానే ఉండొచ్చని బులియన్‌ ట్రేడర్లు అంటున్నారు. శనివారం మాదిరిగానే బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.51,210 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్‌ 1 గ్రాము రూ. 4,695ల వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 5,121లతో స్థిరంగా ఉంది.

  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.
  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 150 పలుకుతోంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 210 పలుకుతోంది.
  • కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.
  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 వద్ద ఉంది.
  • బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 పలుకుతోంది.
  • కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.

గడచిన పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పడుతూ లేస్తున్న విషయం తెలిసిందే. జులై 1వ తేదీన రూ.47,850ఉన్న పసిడి ధర.. 10వ తేదీ నాటికి వెయ్యి రూపాయల మేర దిగొచ్చి రూ.46,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర జులై 1వ తేదీన రూ.52,200లు ఉండగా క్రమంగా తగ్గుతూ జులై 10వ తేదీ నాటికి రూ.51,210లకు చేరుకుంది.

పుత్తడిని అనుసరిస్తోన్న వెండి..

బంగారం మాదిరిగానే వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో కేజీ వెండి ధర రూ.62,800గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.57,200 వద్ద పలుకుతోంది. గడచిన పది రోజుల్లో వెండి ధర ఒక గ్రాముకు రూ.590ల నుంచి రూ.572లకు పడిపోయింది.

దాయాదిదేశంలో ఆల్‌టైమ్‌ రికార్డు ధరలు..
పాకస్థాన్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,660లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,521లు పలుకుతోంది. అంటే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.12,166లు, 22 గ్రాముల బంగారం 1 గ్రాము చొప్పున రూ.11,152లు కొనసాగుతోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.