Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి

వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది. The post Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి appeared first on 10TV.

Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి

Amarnath

Heavy rain : అమర్‌నాథ్‌ యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించింది. మేఘాలకు చిల్లు పడిందా అనేలా భారీ వర్షం కురిసింది. భోలేనాధుడి దర్శనానికి వెళ్లిన భక్తులపై ప్రకృతి ప్రతాపం చూపింది. అప్పటి వరకు దేవుడి దర్శనానికి వెళ్లి వచ్చిన వారిని వరదలు ముంచెత్తాయి. టెంట్లలో సేద తీరుతున్న వారిని వరద తనతో పాటు తీసుకెళ్లింది. వరదల్లో ఐదుగురు మృతి చెందారు.

అమర్‌నాథ్‌ను భారీ వర్షం ముంచెత్తింది. గుహ దగ్గర కుండపోతగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరద ఉధృతికి టెంట్లు కొట్టుకుపోయింది. వరదల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది. మేఘం బద్దలైనట్లుగా వర్షం కురుస్తోంది.

పలువురు యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. యాత్రికులు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. అమర్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది.

The post Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి appeared first on 10TV.