Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్టులను రీల్స్‌గా..

ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చడానికి ప్రయత్నాలు జరుపుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోగా ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు వెల్లడించింది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఈ మార్పును ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. The post Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్టులను రీల్స్‌గా.. appeared first on 10TV.

Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్టులను రీల్స్‌గా..

Instagram Outage Instagram Goes Down Briefly Leaving Users Unable To Login (1)

 

 

Instagram: ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చడానికి ప్రయత్నాలు జరుపుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోగా ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు వెల్లడించింది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఈ మార్పును ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అనేక మంది వినియోగదారులతో టెస్టింగ్ జరుపుతామని అప్లికేషన్‌లోని వీడియోలను సులభతరం చేయడమే ఇన్‌స్టాగ్రామ్ ప్లాన్‌లో భాగమని వెల్లడించింది.

టెస్టింగ్‌లో భాగమైన వినియోగదారుల వీడియో పోస్ట్‌లు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌గా మారుస్తామని యాప్ నుండి ప్రాంప్ట్‌ను చూడొచ్చని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

“ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ఎక్స్‌పీరియెన్స్ ఈజీ చేయడానికి, బెటర్ చేయడంలో భాగం చేయడం కోసమే ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం” అని కంపెనీ ప్రతినిధి ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన వినియోగదారులతో మాత్రమే వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.

Read Also : స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!

మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉండి, మీరు వీడియోను షేర్ చేసినట్లయితే, వ్యక్తులు రీల్స్‌ని క్రియేట్ చేయడానికి వీడియో.. ఆడియోను ఉపయోగించుకోవచ్చని ప్రాంప్ట్ చెబుతోంది. దీనితో ఇప్పుడు ఎవరైనా వినియోగదారు రీల్‌తో రీమిక్స్‌ని క్రియేట్ చేయొచ్చు. వారి రీమిక్స్‌లో భాగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా జోడించింది.

వీడియో పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌గా మార్చే కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇన్‌స్టాగ్రామ్ ఇంకా నిర్ధారించలేదు.

 

The post Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్టులను రీల్స్‌గా.. appeared first on 10TV.