Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. ‘రా రా రెడ్డి’తో దుమ్మురేపుతోన్న అంజలి..

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరీన్ థ్రేసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే,

Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. ‘రా రా రెడ్డి’తో దుమ్మురేపుతోన్న అంజలి..
Macherla Niyojakavargam

Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!.. రా రా రెడ్డి అంటూ అంజలి స్పెషల్‌ సాంగ్ ప్రోమో అదుర్స్‌..
నితిన్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరీన్ థ్రేసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం నుండి రారా రెడ్డి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరో నితిన్ రొటీన్‌కు భిన్నంగా ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నారు.

ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. నితిన్, అంజ‌లి మాస్ బీట్‌ స్టెప్స్ అల‌రిస్తున్నాయి. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ట్యూన్ ఊపునిస్తుంది.

ఈ మాస్ సాంగ్‌, జాత‌ర‌లో జ‌రిగే ఫైట్ ముందు వ‌చ్చే పాట‌లా క‌నిపిస్తుంది. ఫుల్ సాంగ్ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నారు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఆగస్టు 12న సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.



మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి