Mp badruddin ajmal : “ఈద్‌లో గోవధ వద్దు..ఒక్కరోజు ఆవును తినకపోతే చచ్చిపోరు..”

అజ్మల్ ఈద్-ఉల్-అదా రోజున గోవులను వధించవద్దని..ఒక్కరోజు ఆవుని తినకపోతే చచ్చిపోం అంటూ అసోం ఎంపీ..ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ విజ్ఞప్తి చేశారు. The post Mp badruddin ajmal : “ఈద్‌లో గోవధ వద్దు..ఒక్కరోజు ఆవును తినకపోతే చచ్చిపోరు..” appeared first on 10TV.

Mp badruddin ajmal : “ఈద్‌లో గోవధ వద్దు..ఒక్కరోజు ఆవును తినకపోతే చచ్చిపోరు..”

Assam Mp Badruddin Ajmal Calls No Cow Slaughter

assam mp badruddin ajmal calls no cow slaughter : ముస్లింల పండుగ బక్రీద్ కు గొర్రెలు,ఒంటెలు, మేకలు, గేదెలు,గోవులను వధించి తినటం చేస్తుంటారు. అజ్మల్ ఈద్-ఉల్-అదా రోజున గోవులను వధించవద్దని..ఒక్కరోజు ఆవుని తినకపోతే చచ్చిపోం అంటూ అసోం ఎంపీ..ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ పిలుపునిచ్చారు. గౌహతిలోని విలేకరులతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఆవులను బలి ఇవ్వవద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. “హిందువులు మా పూర్వీకులు… గోవధ వద్దు. ఈద్ ఒక్కరోజు ఆవును తినకపోతే చచ్చిపోరు, ఆవులను తినకండి.” అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బద్రుద్దీన్ మాట్లాడుతూ..మన పూర్వీకులందరూ హిందువులేనని, వారు ఇస్లాం మతంలోకి వచ్చారని..ఇతర మతాల మనోభావాలను గౌరవించడమే తమ అభిమతం అని ముస్లిం సోదరులకు సూచించారు. భారతదేశం విభిన్న వర్గాలు, జాతులు, మతాల ప్రజల దేశం. ఇది ఏ ఒక్కరిదో కాదు. భారతదేశంలోని చాలా మంది సనాతన విశ్వాసాన్ని ప్రకటిస్తారు. ఈ సనాతన విశ్వాసం ఆవును పవిత్ర జంతువుగా పరిగణిస్తుంది..అని ఆయన చెప్పారు.

అంతేకాదు రాష్ట్రీయ స్వయంసేకర్ సంఘ్ (RSS) హిందూ రాజ్‌ని చేయడానికి ప్రయత్నించడంతో హిందుస్థాన్‌ను అంతం చేయాలనుకుంటోందని బద్రుద్దీన్ అజ్మల్ విమర్శించారు. అది వారి కలలో కూడా జరగదని బద్రుద్దీన్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ముస్లింలు, హిందువుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరని ధీమా వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అసోం పశు సంరక్షణ చట్టం 2021ని గౌరవించాలని ఆయన ప్రజలను కోరారు.

అలాగే నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు స్పందించకూడదని, దానికి బదులుగా ఆమెకు దేవుడు బుద్ధి ఇవ్వాలని ప్రార్థించాలని అన్నారు. శిరచ్ఛేదం చేయడం మూర్ఖత్వమని అన్నారు. “నుపుర్ వ్యాఖ్యలపై ముస్లింలు ప్రతిస్పందించకూడదు. దానికి బదులుగా నుపుర్ శర్మ వంటి వారికి దేవుడు బుద్ధి ఇవ్వాలని ప్రార్థించాలి. శిరచ్ఛేదం చేయడం మూర్ఖత్వం.” అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

The post Mp badruddin ajmal : “ఈద్‌లో గోవధ వద్దు..ఒక్కరోజు ఆవును తినకపోతే చచ్చిపోరు..” appeared first on 10TV.