Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

నథింగ్ ఫోన్ (1) ఇండియాలో లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఇటీవలే నథింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది. The post Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే? appeared first on 10TV.

Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India

Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఇండియాలో లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. అధికారిక లాంచింగ్ ముందే.. కంపెనీ హ్యాండ్‌సెట్ మరో కీలక ఫీచర్‌ను వెల్లడించింది. ఇటీవలే నథింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది. ఇప్పుడు, ఆ డివైజ్‌లో చిప్‌సెట్ గురించి ఫీచర్ రివీల్ చేసింది కంపెనీ. నథింగ్ ఫోన్ (1) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుందని కంపెనీ CEO కార్ల్ పీ ధృవీకరించారు. మిడ్-రేంజ్ చిప్‌సెట్‌తో రానున్న ఈ నథింగ్ ఫోన్ (1) ధరను హై రేంజ్‌లో రిలీజ్ చేయనుంది. పవర్ ఫుల్ చిప్ మంచి పర్ఫార్మాన్స్ అందించగలదని Pei అంటున్నారు.

నథింగ్ ఫోన్ (1) వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ఎక్కువగా రూ. 50,000 కన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్‌లలో మాత్రమే అందించనుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీనిని కంపెనీ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌గా పిలుస్తోంది. వెనుక ప్యానెల్ కూల్ లైట్ సిస్టమ్‌తో రానుంది. 900 LED వెనుకవైపు అమర్చారు. ఈ డివైజ్ నోటిఫికేషన్‌లు వచ్చిన సమయంలో బ్రైట్ రిప్రెష్ అవుతుంది.

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India (1)

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India 

ఈ డివైజ్ భారత మార్కెట్లో రూ. 30,000 ధర పరిధిలో ఉండే అవకాశం లేదు. లీక్‌ల ప్రకారం ఈ డివైజ్ $500 (సుమారు రూ. 39,500) కంటే తక్కువగా ఉండవచ్చని ఓ నివేదిక తెలిపింది. Passionate Geekz నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. రాబోయే నథింగ్ ఫోన్ ప్రారంభ ధర $397తో వస్తుందని అంటున్నారు. భారత్‌లో దాదాపు రూ. 31,300 వరకు ఉంటుందని అంచనా.

నథింగ్ ఫోన్ (1) అందించే ఫీచర్లలో రూ. 40,000 రేంజ్ ఉండవచ్చని అంటున్నారు. అదే ధరకు, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను ఆఫర్ చేయనుంది. 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర $419 (దాదాపు రూ. 33,000), 12GB + 256GB మోడల్‌కు $456 (సుమారు రూ. 35,900) ఉంటుందని లీక్ పేర్కొంది. నథింగ్ ఫోన్ (1) అధికారిక ధర ఎంత అనేది భారత మార్కెట్లో జూలై 12న రివీల్ చేయనుంది.

Read Also : Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్‌!

The post Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే? appeared first on 10TV.