Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష

ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్‌ దాడికి పాల్పడ్డాడు. The post Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష appeared first on 10TV.

Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Raj Babbar

Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు. ఈ దాడి ఘటన 1996లో జరిగింది. కేసు వివరాల ప్రకారం.. 1996లో రాజ్ బబ్బర్ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేశారు.

Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’

అయితే, ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో 1996 మే 2న రాజ్ బబ్బర్‌పై వాజిర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 143, 332, 353, 323, 504, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే అప్పట్లో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించింది. కాగా, ఈ కేసుపై ఇంతకాలంగా విచారణ సాగింది.

Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే

ఈ కేసులో రాజ్ బబ్బర్‌ తప్పు చేశాడని కోర్టు గుర్తించింది. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. అలాగే రూ.8,500 జరిమానా కూడా విధించింది. కాగా, తీర్పు సమయంలో రాజ్ బబ్బర్‌ కోర్టులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

The post Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష appeared first on 10TV.