Tollywood: సౌత్‌ సక్సెస్ కావాలంటున్న నార్త్ బ్యూటీస్‌.. దక్షిణాది క్యూ కట్టిన ముద్దుగుమ్మలు..

రీసెంట్‌గా బాలీవుడ్ నుంచి సౌత్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్‌. గని, మేజర్‌ లాంటి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన ఈ భామ అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయారు.

Tollywood: సౌత్‌ సక్సెస్ కావాలంటున్న నార్త్ బ్యూటీస్‌.. దక్షిణాది క్యూ కట్టిన ముద్దుగుమ్మలు..
Alia Ananya

సౌత్ సినిమాలతో సత్తా చాటేందుకు నార్త్ భామలు క్యూ కడుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న మన సినిమాలో స్పేస్‌ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యూటీస్‌. ఆల్రెడీ ఈ ప్రాసెస్‌లో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మల మీద స్పెషల్ నజర్ పెట్టారు తెలుగు ఆడియన్స్‌.

రీసెంట్‌గా బాలీవుడ్ నుంచి సౌత్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్‌. గని, మేజర్‌ లాంటి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన ఈ భామ అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయారు. రెండూ హీరో సెంట్రిక్ సినిమాలే కావటంతో సయికీ ప్రూవ్ చేసుకునేందుకు పెద్దగా స్కోప్‌ దక్కలేదు. దీంతో మరో ఛాన్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు ఈ భామ.

ఎంట్రీకి ముందే సౌత్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ అనన్య పాండే. విజయ్‌ దేవరకొండకు జోడిగా లైగర్ సినిమాలో నటిస్తున్న అనన్య గురించి సౌత్ ఆడియన్స్‌ సీరియస్‌గానే మాట్లాడుకుంటున్నారు. ఇంకా బాలీవుడ్‌లోనే ప్రాపర్‌గా సెటిల్ అవ్వని అనన్య, లైగర్‌తో నేషనల్ లెవల్‌లో జోరు చూపించేందుకు రెడీ అవుతున్నారు.

సౌత్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మరో నార్త్ బ్యూటీ మృణాల్ థాకూర్‌. రీసెంట్‌గా సౌత్ రీమేక్‌ జెర్సీలో నటించి మెప్పించిన ఈ భామ.. ఇప్పుడు సీతారామమ్‌తో డైరెక్ట్‌ సౌత్ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ప్రేమకథలో వింటేజ్‌ లుక్‌లో అదరగొడుతున్నారు మృణాల్‌.

జూనియర్లు మాత్రమే కాదు సీనియర్ స్టార్స్‌ కూడా బాలీవుడ్ గడపదాటి… సౌత్ వైపు అడుగులు వేస్తున్నారు. నార్త్ క్యూటీ అలియా భట్‌ ఆల్రెడీ ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ మాత్రమే చేసిన అలియా.. ఛాన్స్ దొరికితే ఫుల్‌ మూవీతో అలరించేందుకు రెడీ అన్న సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు.

మరో బాలీవుడ్ స్టార్‌ దివా దీపికా పదుకోన్ కూడా సౌత్ ఎంట్రీ విషయంలో సీరియస్‌గానే ఉన్నారు. బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న టైమ్‌లోనే ప్రభాస్‌ హీరోగా సౌత్ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న సినిమాకు డేట్స్‌ అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ప్రాజెక్ట్‌ కే దీపికకు సౌత్‌లో రీ ఎంట్రీ మూవీ.