Yogasana: థైరాయిడ్‌ సమస్య వేధిస్తోందా?.. ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి..!

Yogasana: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయపాలన లేని ఆహారం, అధిక శ్రమ, నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు..

Yogasana: థైరాయిడ్‌ సమస్య వేధిస్తోందా?.. ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి..!
Yoga

Yogasana: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయపాలన లేని ఆహారం, అధిక శ్రమ, నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం బారిన పడి జీవితాంతం వాటితో పారాడుతుంటారు. ఈ అనారోగ్యాలు ప్రజలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగదీస్తున్నాయి. అందుకే పౌష్టికాహారం తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని, యోగాసనాలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. తద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ప్రస్తుతం థైరాయిడ్ అనేది ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. థైరాయిడ్ హార్మోన్ మీ జీర్ణవ్యవస్థను నియంత్రించడానికి పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా ఆటంకం ఏర్పడినప్పుడు, ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇలాంటప్పుడు ఒక వ్యక్తి థైరాయిడ్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా బరువు పెరగడం లేదా తగ్గడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, క్రమరహిత పీరియడ్స్, మలబద్ధకం మొదలైన సమస్యలు వస్తాయి. అయితే, యోగా ద్వారా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు యోగా నిపుణులు. ఇందుకోసం కొన్ని యోగాసనాలు ఉన్నాయంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మత్స్యాసనం..
యోగా చాప గానీ, నేలపై గానీ వెల్లకిలా పడుకుని, మీ పాదాలను పద్మాసన భంగిమలో ఉంచండి. మీ తొడలు మరియు మోకాళ్ళను నేలపై ఉంచండి. మీ శ్వాసను పీలుస్తూ.. మీ ఛాతీని పైకి లేపడానికి ప్రయత్నించండి. తల పైభాగాన్ని నేలపై ఉంచండి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండండి. నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోండి.

సింహాసనం..
హెడ్‌రెస్ట్ కోసం యోగా మ్యాట్‌ను నేలపై ఉంచండి. ఆ తరువాత మీ మోకాళ్లపై కూర్చుని వజ్రాసనం భంగిమకు రావాలి. మీ చేతి వేళ్లను కలిపి ఉంచాలి. ఆ తరువాత.. మీ చేతులను నేలపై ఉంచండి. అరచేతులను గిన్నె ఆకారంలో వచ్చే విధంగా వంచాలి. నెమ్మదిగా మీ తలను క్రిందికి వంచి అరచేతులపై ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా మీ రెండు కాళ్లను పైకి కదిలించి వాటిని నిఠారుగా చేయండి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. మామూలుగా శ్వాస తీసుకుంటూ ఉండండి. మళ్లీ సాధారణ భంగిమకు తిరిగి రావాలి.

సర్వంగాసనం..
సర్వంగాసనం కూడా థైరాయిడ్‌కు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా చాపపై వెల్లకిగా పడుకోవాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. చేతులను నేలపై ఉంచి, నడుము నుండి శరీరాన్ని నెమ్మదిగా పైకి కదిలించాలి. రెండు చేతులను నేల నుండి పైకి లేపుతూ.. వెనుకకు సపోర్ట్ ఇవ్వాలి. మోచేతులను నేలపై ఉంచండి. పై భాగాన్ని నడుము పైన ఉంచి, బరువు మొత్తం చేతులు, భుజాలపై వేయండి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండండి. ఆ తరువాత సాధారణ స్థితికి తిరిగి రావాలి.

గమనిక: ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ ఆసనాలను వేసే ముందు డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవాలి.

 మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..