Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు
కొన్నేళ్లుగా టిబెట్‌కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. The post Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు appeared first on 10TV.
Dalai Lama: దలైలామా భారత దేశ అతిథి అని, ఆయనను గౌరవించాలనేది ప్రభుత్వ విధానమని చెప్పారు భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి అరిందమ్ బాగ్చి. కొన్నేళ్లుగా టిబెట్‌కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు.
Fake Baba: 10టీవీ ఎఫెక్ట్… ఫేక్ బాబాపై కేసు నమోదు
ఫోన్‌లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. అయితే, దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ ప్రతినిధి జాహ్ లిజియాన్ మాట్లాడుతూ దలైలామాలోని చైనా వ్యతిరేక భావాలను భారత్ గుర్తించాలని, అలాంటి వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పడం సరికాదని చైనా ప్రతినిధి అన్నారు. కాగా, దీనికి భారత్ ధీటైన జవాబిచ్చింది. ‘‘దలైలామా మా దేశ అతిధి. అయన్ను గౌరవించాలనేది మా విధానం. గత సంవత్సరం కూడా ప్రధాని దలైలామాతో మాట్లాడారు. దలైలామాకు ఇండియాలో ఎందరో అభిమానులు, అనుచరులు ఉన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలు దేశమంతా జరుగుతాయి’’ అని బాంగ్చి తెలిపారు.
Akasa Air: ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ అనుమతి.. ఈ నెలలోనే సర్వీసులు ప్రారంభం
మరోవైపు అమెరికా సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ కూడా దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా, ఆయన అనుచరులు ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందిస్తున్నారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. దీనిపై కూడా చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
The post Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు appeared first on 10TV.