Diabetes Diet: డయాబెటిక్ బాధితులకు అద్భుతమైన మెడిసిన్.. ఈ ఐదు మూలికలు తీసుకుంటే చాలు..

Herbs for Lowering Blood Sugar: మధుమేహాన్ని నియంత్రించడానికి మందులతో పాటు కొన్ని మూలికల వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా..

Diabetes Diet: డయాబెటిక్ బాధితులకు అద్భుతమైన మెడిసిన్.. ఈ ఐదు మూలికలు తీసుకుంటే చాలు..
Herbs And Supplements

మన దేశంలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారతదేశాన్ని మధుమేహ రాజధాని అంటారు. కోవిడ్-19 సంక్రమణ తర్వాత ఈ వ్యాధి రోగుల సంఖ్య వేగంగా పెరిగింది. మధుమేహం అనేది సరైన ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం, ఒత్తిడి వల్ల వచ్చే  ఈ సమస్య వస్తోంది. ఈ వ్యాధిని నియంత్రించడం చాలా ముఖ్యం. మధుమేహం అనేది ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి మందులతో పాటు కొన్ని మూలికల వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ఆయుర్వేద వైద్యులు కొన్ని ప్రత్యేక మూలికలు, సుగంధ ద్రవ్యాలను సూచించారు.

ఈ మూలికలు, మసాలా దినుసులు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. మన దేశంలో చాలా సాంప్రదాయ మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఇన్సులిన్ కంటే తక్కువ కాదు. వీటిని తీసుకోవడం ద్వారా జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. చక్కెరను నియంత్రించే సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిప్ప ఆకు, తిప్ప సత్తు తినండి: రుచిలో చేదుగా ఉండే తిప్ప ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జలుబు, దగ్గుకు చికిత్స చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాలేయ సమస్యలను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఉసిరి, పసుపు: ఉసిరి, పసుపు రెండూ మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. ఉసిరి, పసుపును సమపాళ్లలో కలిపి మధుమేహ రోగులకు తినిపిస్తే షుగర్ అదుపులో ఉంటుంది.

త్రిఫల, మంజిష్ట, గోక్షుర్(Bindii, పల్లేరు (ట్రైబులస్ టెరెస్ట్రిస్) తినండి: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. త్రిఫల, మంజిష్ట, పల్లేరు వంటి అద్భుతమైన మూలికలు కాలేయం, మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. శుంఠి, పిప్పలి, మారీచ ఈ మూడింటిని కలిపితే త్రిఫల అంటారు. ఇవి మధుమేహాన్ని నిరోధించే సుగంధ ద్రవ్యాలు. అంతే కాదు ఇవి మీ జీవక్రియను పెంచుతాయి.

వేప, గుడ్మార్: ఈ రెండూ కూడా అద్భుతమైన చేదు మూలికలు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

అశ్వగంధ: ఇది ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం కలిగించే దివ్వమైన ఔషదం. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మూలిక. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం..