Hyderabad: వామ్మో ఇవేం తెలివితేటలురా.. నరాలు కట్ అయిపోతున్నాయ్! స్టన్ అయిన అధికారులు

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణా యథేశ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్‌ రాయుళ్లు ఎవరికీ అంతు చిక్కని మార్గాలను అన్వేషిస్తున్నారు.

Hyderabad: వామ్మో ఇవేం తెలివితేటలురా.. నరాలు కట్ అయిపోతున్నాయ్! స్టన్ అయిన అధికారులు
Gold Smuggling

Telangana: బంగారం స్మగ్లర్లు అస్సలు తగ్గడం లేదు. విసృత తనిఖీలు జరుగుతున్నా.. వెనకడుగు వేయడం లేదు.  విగ్గులు, సాక్సులు, లోదుస్తులు, మలద్వారం.. ఇలా ఏ పద్దతిని వదలడం లేదు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లు రెచ్చిపోతున్నారు.  అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బంగారం రవాణా నిత్యకృత్యంగా మారుతోంది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌(Shamshabad Rajiv Gandhi International Airport )లో బంగారం అక్రమ రవాణా యథేశ్చగా కొనసాగుతోంది.  స్మగ్లింగ్‌ రాయుళ్లు ఎవరికీ అంతు చిక్కని మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు, మహిళలు సైతం విదేశాల నుండి గోల్డ్ అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నించిన ఘటనలు ఈ మధ్య కాలంలో చూశాం. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన గోల్డ్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం దుబాయ్‌(Dubai) నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.1.20 కోట్ల విలువైన 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో నటుడు సూర్య నటించిన.. “వీడొక్కడే” సినిమా తరహాలో జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. సూట్‌ కేసు రాడ్లల్లో దాచుకుని బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..