Health: వేడి నీళ్లతో స్నానం చేసే వారికి వార్నింగ్.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

మనం సాధారణంగా వేసవి కాలంలో చన్నీళ్లతో, వర్షాకాలం, శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇక కొందరు కాలంతో పని లేకుండా వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇంకొందరు మాత్రం చన్నీళ్లతో స్నానం చేయడం అలవాటుగా మార్చుకుంటారు. ఏ నీటితో...

Health: వేడి నీళ్లతో స్నానం చేసే వారికి వార్నింగ్.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Bathing

మనం సాధారణంగా వేసవి కాలంలో చన్నీళ్లతో, వర్షాకాలం, శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇక కొందరు కాలంతో పని లేకుండా వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇంకొందరు మాత్రం చన్నీళ్లతో స్నానం చేయడం అలవాటుగా మార్చుకుంటారు. ఏ నీటితో స్నానం చేస్తే ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ.. మనం ఏ నీటితో స్నానం చేస్తున్నామనే విషయంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వేసవిలో చల్లని నీటితో వర్షాకాలం, చలి కాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తారు. అయితే కాగా చల్లని నీటితో స్నానం చేసేవారిలో ఉబకాయం సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసే వారిలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా బరువు తగ్గడానికి క్యాలరీ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది.

ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు ఎలుకలను ఉపయోగించారు. ఎలుకల గుంపుకు అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని అందించారు. వాటిలో కొన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద,  మరికొన్ని సాధారణ ఉష్ణోగ్రత కలిగిన ఆహారాన్ని అందించారు. ఈ క్రమంలో చలిలో ఉండటం వల్ల ఊబకాయం వల్ల కలిగే మంటతో పాటు గ్లూకోజ్‌ని గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. అంతే కాకుండా చల్లని ఉష్ణోగ్రతలలో ఉంచినప్పుడు, ఎలుకలు బరువు కోల్పోయినట్లుగా వారు గుర్తించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి